Business is booming.

ఎన్నికల నేపథ్యంలో టీచర్లకు సంక్రాంతి సెలవులు రద్దు

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు సంక్రాంతి సెలవులు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఐ విజయ కుమారి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి 1853 మంది ఉపాధ్యాయులు, హెచ్ ఎంలు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొంటారని, ఈ నెల 21న తొలి విడుతలో శామీర్ పేట, కీసర మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆయా మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇవ్వనున్న ఎన్నికల శిక్షణకు తప్పకుండా హాజరు కావాలన్నారు.

ఎన్నికల విధులకు సంబంధించి ఉపాధ్యాయుల ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడ పూర్తయిందన్నారు. కనుక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు ఈ సంక్రాంతి సెలవులు రద్దు చేసినందున ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫోన్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేయాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.