ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టులో.. చతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ చేశాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ పుజారాకు ఇది టెస్టుల్లో 21వ అర్థ సెంచరీ. ఈ సిరీస్‌లో అతనికి ఇది నాలుగవ హాఫ్ సెంచరీ కావడం విశేసం. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి రోజు టీ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. పుజారా 61, కోహ్లీ 21 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. రెండవ సెషన్లో భారత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యాన్ని చాటారు. ఈ సెషన్లో భారత్ 108 రన్స్ సాధించింది. ఓపెనర్ మయాంక్ 77 రన్స్ చేసి ఔటయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మయాంక్ క్యాచ్ ఔటయ్యాడు.
Comments are closed, but trackbacks and pingbacks are open.