Business is booming.

ఒక్కరోజు స్కూలుకెళ్లలేదు.. కానీ బోర్డు పరీక్షలకు అర్హత సాధించింది..!

ఆ అమ్మాయి వయసు కేవలం 12. అంటే ఆరో క్లాసో లేక ఏడో క్లాసో చదివే వయసు. కానీ.. ఏకంగా 10 వ క్లాస్ బోర్డ్ పరీక్షలు రాయడానికి అర్హత సాధించింది. షాకింగ్‌గా ఉంది కదా. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి తన జీవితంలో ఒక్కరోజు కూడా స్కూల్‌కు వెళ్లలేదు. మతిపోతుందా. ఆ అమ్మాయి పేరు సైఫా ఖాటున్. ఊరు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా. వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లు నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. నిజానికి పదో క్లాస్ బోర్డ్ పరీక్షలు రాయాలంటే కనీసం 14 సంవత్సరాల వయసు ఉండాలి. అయినప్పటికీ.. సైఫా ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించడంతో తనను బోర్డ్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చింది బోర్డు.

ఎలిజిబిలిటీ టెస్ట్‌లో సైఫాకు 52 శాతం మార్కులు వచ్చాయి. దీంతో సైఫా ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒక్కరోజు కూడా స్కూలుకెళ్లకుండా అర్హత పరీక్షలో సైఫా ఎలిజిబిలిటీ సాధించడంతో బోర్డు అధికారులు కూడా షాకవుతున్నారు. గత సంవత్సరం హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు కూడా 12 వ క్లాస్ పరీక్షలను క్లియర్ చేశాడు. అగస్త్య జైస్వాల్ అనే బాలుడు 12 వ క్లాస్ పరీక్షలను క్లియర్ చేసిన అతిపిన్న వయస్సు వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఇప్పుడు సైఫా మరో రికార్డు క్రియేట్ చేసింది.

Leave A Reply