Business is booming.

నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ఐఆర్‌సీటీసీ – భారతీయ రైల్వే సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ 14న ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు రామాయణంతో సంబంధం ఉన్న శ్రీలంకతో సహ, భారత దేశంలో ముఖ్యమైన ప్రదేశాలను 16 రోజుల్లో చుట్టి వస్తుంది. ఈ 16 రోజుల్లో రైలు చెన్నై చేరుకున్న అనంతరం చెన్నై విమానాశ్రయం నుంచి కొలంబోకు విమానంలో తీసుకువెళతారు. శ్రీలంకాలో రామాయణంతో సంబంధం ఉన్న చారిత్రక ప్రదేశాలను చూపించి తిరిగి కొలంబో నుంచి చెన్నైకి విమానంలో తీసుకొస్తారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.