Business is booming.

నేను చిన్న సినిమాలు చేయలేను: బోయపాటి

మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌, కియారా అద్వాని హీరోహీరోయిన్లుగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయవిధేయరామ’. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీను మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. అయితే అన్నీ భారీ చిత్రాలు చేస్తున్నారు. చిన్న బడ్జెట్‌లో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు బోయపాటి సమాధానమిస్తూ..
‘‘నేను చిన్న సినిమాలు చేయలేను. నా నుండి ఆడియెన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది 100% ఇవ్వాలి అనే నేననుకుంటా. అవతల ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉండి, మ‌న ప్రొడ‌క్ట్ ఇంకోలా ఉంటే మ్యాచ్ అవ్వదు. అందుకే నేను చిన్న సినిమాలు చేయను. ఒకవేళ నేను బయోపిక్ చేసినా, అందులో కూడా దమ్ము కంపల్సరీగా ఉంటుంది..’’ అని అన్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.