Business is booming.

నా లవ్ బ్రేకప్ అయింది…సినీనటి తాప్సీ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీనటి తాప్సి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను 9వ తరగతిలో ఉన్నపుడే ఒకబ్బాయితో ప్రేమలో పడ్డాను…కాని పదోతరగతి పరీక్షలు వస్తున్నాయని నేను ప్రేమించిన అబ్బాయి నన్ను వదిలేశాడు’’అంటూ తాప్సీ తన చిన్ననాటి ప్రేమ బాగోతాన్ని బయటపెట్టింది. పాఠశాల వయసులోనే మొదలైన తన మొదటి ప్రేమ బ్రేకప్ అయిందని తాప్పి వెల్లడించింది.

భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాప్సీ తన చిన్ననాటి ప్రేమ సంగతులను వెల్లడించింది. ‘‘ఆ సమయంలో సెల్ ఫోన్లు లేకపోవడంతో నేను ఇంటి వెనుక ఉన్న పబ్లిక్ ఫోన్‌బూత్‌కు వెళ్లి ప్రేమించిన యువకుడికి ఫోన్ చేసి నన్ను ఎందుకు వదిలేశావ్ ? అని ఏడ్చే దాన్ని…ఇప్పుడు ఆ నాటి ఘటనలు తలుచుకుంటే నవ్వు వస్తోంది’’ అని తాప్సి పేర్కొంది. తాను ఆగస్టు 1వతేదీన పుట్టానని తాను చేసే పని హైలెట్ గా ఉండాలని కోరుకుంటానని చెపుతూ అలానే తాను పెళ్లాడబోయే వ్యక్తి ఆలోచనలు కూడా తనలాగే ఉండాలని తాప్సీ కోరింది. తాను ప్రేమించే వ్యక్తితో అభిప్రాయాలు కలవాలని, తాను ప్రేమలో ఉన్నపుడు ఆ విషయాన్ని అందరికీ చెప్పేస్తానని తాప్సీ చెప్పింది.

Comments are closed, but trackbacks and pingbacks are open.