Business is booming.

మెట్రోమార్గాల్లో ఆర్టీసీ రూట్ల కుదింపు

సంక్రాంతి తర్వాత నగర రోడ్లపైకి బ్యాటరీ బస్సులు 

మెట్రోకు సమాంతరం గా నడుస్తున్న బస్సులను తగ్గించి, మెట్రోస్టేషన్లనుంచి ఇతర ప్రాంతాలకు బస్సులను తిప్పడం ద్వారా రెవెన్యూ పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నది. గురువారం ఆర్టీసీ బస్‌భవన్‌లో ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టం వచ్చే బస్సు రూట్లపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ దుకాణాల ఆదాయం 10శాతం పెంచుకోవాల ని సూచించారు. ఖాళీస్థలాల్లో మల్టీఫ్లెక్స్‌లు, పెట్రోల్ బంకుల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. బస్‌పాస్‌లు పెంచాలని, ఉమ్మడిపాస్‌లు త్వరగా ప్రవేశపెట్టాలన్నారు.

సంక్రాంతి తర్వాత ఎలక్ట్రికల్ బస్సులకు ముహూర్తం

40 ఎలక్ట్రికల్ బస్సులను సంక్రాంతి తర్వాత నగరరోడ్లపైకి తేవాలని ఆర్టీసీ భావిస్తున్నది. వీటిని ప్రైవేటు ఆపరేటర్లే హైర్ పద్ధతిన నడుపుతారని తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయించగా అందులో 30 శాతం నగరానికి కేటాయించనున్నట్టు తెలిసింది.

Comments are closed, but trackbacks and pingbacks are open.