Business is booming.

మేమంతా ఒక్కటే: చిరంజీవి

  • అభిమానులకు తెలియజేసేందుకే హీరోలందరూ రాక
  • అట్టహాసంగా టీఎస్‌ఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానం
ఇండస్ర్టీలోని నటులంతా స్నేహభావంతో కలిసే ఉంటున్నాం. ఈ సత్యాన్ని అభిమానుల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తామంతా సుబ్బిరామిరెడ్డి నిర్వహిస్తున్న వేడుకలకు వస్తున్నాం, కళాకారులు, కళలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి మనసుతో సహకరిస్తున్నాం’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. నగరంలోని పోర్టు స్టేడియంలో టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో టీఎస్ఆర్‌ 2017-18 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా చిరంజీవి మాట్లాడుతూ రంగస్థలం చిత్రంలో ఉత్తమ నటుడిగా ఎంపికైన చరణ్‌కు వచ్చిన అవార్డును తాను స్వీకరించడం.. చరణ్‌ తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ఒకే వేదికపై అగ్ర నటులందరినీ చేర్చడం సుబ్బిరామిరెడ్డికే సాధ్యమన్నారు. శాతకర్ణి చిత్న్రఇ్న అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, తాను ఎంతగానో ఇష్టపడే రంగస్థలం, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలకు అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు.
మోహన్‌బాబు మాట్లాడుతూ, 18 ఏళ్లుగా ఓటు అడగకుండా విశాఖ వాసుల సంతోషం కోసం అనేక మంచి పనులను సుబ్బిరామిరెడ్డి చేయడం గొప్ప విషయమన్నారు. తన తండ్రి లాంటి దాసరి పేరిట అవార్డును తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంతోషంలోనే తనకు శక్తి లభిస్తుందని, వారి సంతోషం కోసమే పదేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నానని తెలిపారు. సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌, సిరివెన్నెల సీతారామశాస్ర్తి, విద్యాబాలన్‌, దేవీశ్రీ ప్రసాద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియమణి, పూజాహెగ్డే, దేవీశ్రీప్రసాద్‌, బోనీ కపూర్‌, తదితరులు పాల్గొన్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.