Business is booming.

‘మా సినిమా వల్ల ఎవ్వరికీ నష్టం రాదు.. రానివ్వను’

న‌ల్లస్వామి స‌మ‌ర్పణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణముర‌ళి ప్రధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ‌.వి ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఎ.ప‌ద్మనాభ‌రెడ్డి, న‌ల్ల అయ్యన్ననాయుడు నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత ప‌ద్మనాభ‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని అన‌గానే వీడికేమైంది? సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ‌తానంటున్నాడు అని అనుకున్నారు. కానీ మ‌నిషికి దేవుడు ఓ బ్రెయిన్‌ని ఇచ్చాడు. కేవ‌లం పుట్టి.. పెరిగి.. పెళ్లి చేసుకుని, పిల్లల్ని క‌ని, పెద్ద చేసి చ‌నిపోవ‌డానికే మ‌నిషి ఆ బ్రెయిన్‌ని వాడ‌కూడ‌దు. ఏదైనా కొత్తగా చేసి చూపించాలి. అలా చేసిన‌ప్పుడే అంద‌రూ మ‌న‌ల్ని గుర్తు పెట్టుకుంటారు. ఓ కొత్త బ్యాన‌ర్‌ను పెట్టుకుని కొత్త వారితో సినిమాలు చేయాల‌నుకుంటున్నాం. మా సినిమా వ‌ల్ల ఎవ‌రికీ న‌ష్టం రాదు..రానివ్వను. ఒక సినిమా పోతే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఐదు సినిమాలు ఇస్తా. నేను అనుకునే స్థానంలో తప్పకుండా నిలబడతాను.
నేను చెప్పిన స్థాయిలో కనపడకుండా చనిపోతే ఒక కుక్క చనిపోయిందనుకోండి. నేను చాలా సినిమాలు తీస్తున్నాను. త‌క్కువ ఖ‌ర్చులో సినిమా ఎలా తీయాలో నేను నేర్చుకున్నాను. అలా అద్భుత‌మైన సినిమాలు తీద్దామ‌ని నా నిర్మాత‌ల‌కు కూడా ఇదే వేదిక‌గా చెబుతున్నాను. రేపు నా బ్యాన‌ర్ నుండి ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమాకు క‌చ్చితంగా ఓ విలువ ఉంటుంద‌ని చెప్పగ‌ల‌ను. రంగు సినిమా చాలా బాగుంటుంది. అద్భుత‌మైన సినిమా తీశామ‌నే న‌మ్మకంతో ఉన్నాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తే మ‌రిన్ని మంచి సినిమాలు చేస్తాను..’’ అన్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.