Business is booming.

లక్కీ మొక్కలు!

ఒకప్పుడు మొక్కలతో గార్డెన్‌ని అందంగా పెంచేవారు. ఇప్పుడు మొక్కలతో ఇంటిని అందంగా అలంకరిస్తున్నారు. వాటితో అందమే కాదు ఐశ్వర్యం కూడా వస్తుందట. 

-లక్కీ బాంబూ మొక్కలు చైనాలో పుట్టినప్పటికీ భారతదేశంలో ఫెంగ్ షూ ఇలో భాగాంగా ఎక్కువగా పెంచుతున్నారు. ఈ మొక్కలు నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్‌తో కట్టి ఉంటాయి. ఇవి కుటుంబంలో ఐకమత్యానికి గుర్తుగా భావిస్తూ అలంకరణగా కూడా పరిగణిస్తారు.

-ఫోర్ లీఫ్ క్లోవర్ మొక్కలు అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందాయి. ఇది చాలా అరుదైన మొక్క. నాలుగు ఆకులుంటాయి. ఈ మొక్క కనబడితే చాలు మంచి జరుగుతుందని నమ్మకం. ఈ మొక్కలు ఇంటికి అందాన్ని తెచ్చిపెడుతాయి.

-తులసిమొక్కలకు హిందువులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తారు. ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని తొలిగిస్తుందని అందరూ భావిస్తారు. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

-అదృష్టాన్నిచ్చే మొక్కలలో మనీప్లాంట్ ఒకటి. ఈ మొక్కను నీటి బాటిల్‌లో కూడా పెంచుతుంటారు. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. మొక్క పై నుంచి కిందికి పాకడం అంత మంచిది కాదు. కింది నుంచి పైకి పాకితేనే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి.

-స్నేక్ ప్లాంట్-మొక్కలు గాలిలో ఉన్న విషవాయువులను పీలుస్తుంది. ఇది తేమని కలిగి ఉంటుంది. ఈ మొక్క అదృష్టం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

Comments are closed, but trackbacks and pingbacks are open.