Business is booming.

కలిసొచ్చిన ప్రేమ పెండ్లి

జర్వేషన్‌తో వరించిన సర్పంచ్ పదవి

ప్రేమ జంటకు పంచాయతీ రిజర్వేషన్ కలిసొచ్చింది. మతాలు వేరైనా ఇద్దరి మనుసులు ఒకటి కావడంతో ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆ యువతికి రిజర్వేషన్ రూపంలో సర్పంచ్ పదవి వరించింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామానికి చెందిన షేక్ జకీర్, మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా సునీత 2012లో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు.

ప్రస్తుతం చిన్న ధర్మారం ప్రత్యేక గ్రామ పంచాయతీ కావడంతో సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వు అయ్యింది. ఆ గ్రామంలో సునీత ఒక్కరు మాత్రమే ఎస్టీ కావడంతో ఆమెకు సర్పంచ్ పదవి కలిసి వచ్చింది. టీఆర్‌ఎస్ మద్దతుదారుగా సునీత నామినేషన్ వేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో సునీత ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
– కాసిపేట రూరల్

Comments are closed, but trackbacks and pingbacks are open.