Business is booming.

ఐస్‌క్యూబ్‌తో మర్దన చేస్తే..

ఐస్‌క్యూబ్స్‌ని వేసవిలోనే ఎక్కువగా వాడుతుంటారు. చలికాలంలో వాటి జోలికే పోరు. ఐస్‌క్యూబ్స్ ప్రయోజనాలు తెలిస్తే ఏ కాలంలో అయినా వాడాలనిపిస్తుంది. అవేంటో తెలుసుకోండి.

-దెబ్బ తగిలినప్పుడు నొప్పి, రక్తం గడ్డకట్టడంలాంటివి జరుగుతాయి. ఆ పరిస్థితుల్లో ఐస్‌క్యూబ్‌ని దెబ్బతగిలిన ప్రాంతంలో రుద్దాలి. ఇలా చేస్తే ఉపశమనంతో పాటు రక్తం గడ్డ కట్టడాన్ని ఆపుతుంది.

-శరీరం కాలిన వెంటనే ఐస్‌క్యూబ్‌తో గాయాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. ఐస్‌క్యూబ్‌తో రుద్దడం వల్ల మంట కూడా తగ్గుతుంది.

-గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు, కిచ్ కిచ్ మంటూ ఇబ్బంది పెడుతుంటుంది. ఐస్‌క్యూబ్‌ని తీసుకొని గొంతు పై భాగంలో మెల్లగా రుద్దితే విముక్తి లభిస్తుంది.

-చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడతుంటారు. నొప్పి ఉన్న చోట ఐస్‌క్యూబ్‌ను రెండు నిమిషాల పాటు ఉంచాలి. రోజూ 10 పదిసార్లు చేస్తే నొప్పి మటుమాయం. 

-ముక్కు మీద దెబ్బ తగిలితే రక్తం కారుతుంది. ఈ పరిస్థితుల్లో ఐస్‌ముక్కలను బట్టలో కట్టి ముక్కు మీద పెట్టాలి. కొద్ది నిమిషాలకి రక్తస్రావం ఆగుతుంది.

-కిందపడినప్పుడు శరీరంలోని ఏదైనా భాగం బెణుకుతుంది. దాంతో ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఐస్‌క్యూబ్‌ని దెబ్బతగిలిన చోట ఉంచితే వాపు తగ్గుతుందంటున్నారు వైద్యులు.

Comments are closed, but trackbacks and pingbacks are open.