Business is booming.

గంభీర్ ‘యుద్ధం’ ట్వీట్‌పై అఫ్రిది స్పందన

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఏకమైంది. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల్సిందేనని జాతి యావత్తు పట్టుబడుతోంది. దీంతో భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో సరిహద్దు గ్రామాలు బిక్కిబిక్కుమంటున్నాయి.
పుల్వామా ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్.. పాకిస్థాన్‌తో, వేర్పాటు వాదులతో చర్చించాల్సిందేనని, కాకపోతే అది యుద్ధ రంగం కావాలని ఘాటుగా ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక యుద్ధంతోనే బుద్ధి చెప్పాలని అన్నాడు.
గంభీర్‌- పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సమకాలీన రాజకీయాలపై సందర్భోచితంగా స్పందిస్తుంటారు. ఒకరి ట్వీట్లపై మరొకరు స్పందిస్తూ ఉంటారు. తాజాగా పుల్వామా ఘటనపై గంభీర్ చేసిన ట్వీట్‌పై స్పందించాల్సిందిగా అఫ్రిదిని విలేకరులు కోరగా.. ‘అతడికేమైంది?’ (క్యా హో గయా ఉస్కో?) అని ప్రశ్నించాడు. అంతకుమించి ఈ విషయం గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

Comments are closed, but trackbacks and pingbacks are open.