Business is booming.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా.. మొబైల్స్‌పై భారీ డీల్స్

ఫెస్టివల్ సీజన్‌లో మొబైల్స్ కొనలేకపోయామని బాధపడుతున్న వారికి ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు నాలుగు రోజులపాటు మొబైల్స్ బొనాంజా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై రాయితీలు, బండిల్ ఆఫర్లు ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా ఆఫర్లలో కొన్ని..
ఇటీవల నిర్వహించిన ఫెస్టివ్ సీజన్ సేల్‌లో హాట్ కేక్‌లా అమ్ముడుపోయిన ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1‌పై ఫ్లిప్‌కార్ట్ మరోమారు ఆఫర్లు ప్రకటించింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను ఇప్పుడు రూ.9,999కే అందిస్తోంది. 4జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్ ధరను రూ.10,999కి తగ్గించింది. 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్‌ను రూ.13,999కే అందుబాటులోకి తెచ్చింది. వీటన్నింటిపైనా నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఉన్నాయి.
నోకియా 6.1 ప్లస్
నోకియా 6.1 ప్లస్ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.17,600 కాగా, ఇప్పుడు రూ.14,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 9.0 పీ అప్‌డేట్, డ్యూయల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.
షియోమీ పోకో ఎఫ్ 1
రూ.21,999 ధర కలిగిన షియోమీ పోకో ఎఫ్1 ప్రస్తుతం రూ.20,999కే అందుబాటులోకి వచ్చింది. బండిల్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ.16,900 వరకు తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, రియర్ డ్యూయల్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
వీటితోపాటు ఆనర్ 9, నోకియా 5.1 ప్లస్, గెలాక్సీ ఆన్ 6, మొటోరోలా వన్ పవర్, మోటో ఎక్స్ 4 తదితర ఫోన్లపైనా భారీ ఆఫర్లు ఉన్నాయి.

Comments are closed, but trackbacks and pingbacks are open.