Business is booming.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులకు యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్(నిఫ్డ్) డైరెక్టర్ యు.గీత తెలిపారు. బర్కత్‌పుర కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 3 సంవత్సరాల బీఎస్సీ డిగ్రీ ఫ్యాషన్ టెక్నాలజీ, రెండు సంవత్సరాల ఇంటర్ ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, సంవత్సరం పాటు డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్, 6 నెలలు, 3 నెలలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో పాటు ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్(స్కెచ్చింగ్), సర్‌ఫేస్ ఆర్నమెంటేషన్ (ఎంబ్రాయిడరీ అండ్ పెయింటింగ్), టెక్స్‌టైల్స్ సైన్స్(డైనింగ్ అండ్ ఫెయింటింగ్), ఫ్యాట్రన్ మేకింగ్(ఫ్యాబ్రిక్ కటింగ్), గార్మెంట్ కన్‌స్ట్రక్షన్ (టైలరింగ్) కోర్సుల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన ఆసక్తిగల యువతీ, యువకులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 9030610033/55లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.