Business is booming.

దుబాయ్ నుంచి వచ్చి సర్పంచ్‌గా పోటీ

సర్పంచ్ పదవిపై ఉన్న మోజు సముద్రాలను సైతం దాటివచ్చేలా చేస్తున్నది. ఓ వలసజీవి ఏకం గా దుబాయ్ నుంచి సర్పంచ్‌గా పోటీ చేసేందుకు స్వదేశానికి వచ్చాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటకు చెందిన నోముల శివ కొన్నేండ్లుగా ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఊరికి ఏదైనా చేయాలనే తపనతో గతంలో తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు.

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. రిజర్వేషన్ సైతం తనకు అనుకూలంగా రావడంతో బరిలోకి దిగనున్నాడు. గతంలో శివ నానమ్మ సైతం సర్పంచ్‌గా పనిచేశారు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న విషయాన్ని గురువారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు శివ తెలిపాడు.

Comments are closed, but trackbacks and pingbacks are open.