Business is booming.

కాషియో ప్రొ ట్రెక్ స్మార్ట్ నూతన స్మార్ట్‌వాచ్ విడుదల

ప్రముఖ వాచ్‌ల తయారీదారు కాషియో తన నూతన స్మార్ట్‌వాచ్ ప్రొ ట్రెక్ స్మార్ట్ డబ్ల్యూఎస్‌డీ ఎఫ్-30 ని తాజాగా విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఈ వాచ్‌ను విక్రయించనున్నారు. మిలటరీ స్టాండర్డ్ స్పెసిఫికేషన్లను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. అందువల్ల వాచ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

ఈ వాచ్‌లో 1.2 ఇంచ్ డ్యుయల్ లేయర్ డిస్‌ప్లే, 390 x 390 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆఫ్‌లైన్ మ్యాప్స్, జీపీఎస్, గూగుల్ వియర్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఫోన్ కంపాటబిలిటీ, 50 మీటర్ల వరకు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ప్రెషర్ సెన్సార్, యాక్సలరోమీటర్, జైరో మీటర్, కంపాస్, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, వైఫై, మైక్రోఫోన్, 1.5 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ.38,865 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు బ్లూ, బ్లాక్, ఆరెంజ్ కలర్ వేరియెంట్లలో లభ్యం కానుంది.

Comments are closed, but trackbacks and pingbacks are open.