Business is booming.

భారత్‌లో విడుదలైన ఆనర్ 8సి.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు

 చైనా మొబైల్ మేకర్ వావే సబ్‌బ్రాండ్ ఆనర్ తన తాజా స్మార్ట్‌ఫోన్ ఆనర్ 8సిని భారత్‌లో విడుదల చేసింది. సరికొత్త స్నాప్‌డ్రాగన్ 632 ఎస్‌ఓసీ, ఫేస్ అన్‌లాక్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
ఆనర్ 8సి 4జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.11,999. ఇందులో 64 జీబీ వేరియంట్ ధర రూ.12,999. ఇవి రెండు అరోరా బ్లూ, మేజిక్ నైట్ బ్లాక్, ప్లాటినం గోల్డ్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.  డిసెంబరు పది నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్, హైఆనర్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఈఎంయూఐ 8.2 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 6.26 అంగుళాల హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 632 ఎస్ఓసీ, 4 జీబీ ర్యామ్, 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 32 జీబీ, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియంట్లు, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Comments are closed, but trackbacks and pingbacks are open.