Business is booming.

ఆటో డ్రైవర్ కూతురు.. ఎస్సెస్సీలో 99.31 శాతం సాధించింది!

ఆటో డ్రైవర్ కూతురు ఎస్సెస్సీలో 99.31 శాతం సాధించింది. గుజరాత్ సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(జీఎస్‌హెచ్‌ఎస్‌ఈబీ) ఇవాళ ఎస్సెస్సీ ఫలితాలను ప్రకటించింది. ఒక్క ఆటో డ్రైవర్ కూతురే కాదు.. పేదల పిల్లలు, కూలీల పిల్లలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలు ఎస్సెస్సీలో మెరిసినట్లు బోర్డు ప్రకటించింది. అందులో 16 ఏండ్ల ఆఫ్రీన్ షేక్ ఒకరు. ఆహ్మదాబాద్‌లోని ఎఫ్‌డీ హైస్కూల్‌లో చదివిన ఆఫ్రీన్ భవిష్యత్తులో మెడిసిన్ చదవి డాక్టర్ అవనున్నట్లు తెలిపింది.

“నేను నలుగురు పిల్లలను పోషించాలి. దాంతో పాటు ఆఫ్రీన్‌ను డాక్టర్ చదివించాలి. తన కలను ఎలాగైనా నెరవేర్చుతా. నేను పడుతున్న కష్టాన్ని చూసే భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి కష్టం పడకూడదని నా కూతురు రాత్రింబ‌వళ్లు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నది.. “అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఆఫ్రీన్ తండ్రి హమ్జా.

“మంచి మార్కులు వస్తాయనుకున్నా కాని.. టాప్ మార్కులు వస్తాయనుకోలేదు. సైన్స్ స్ట్రీమ్‌లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎలాగైనా డాక్టర్‌ని అవుతాను. చాలామంది డాక్టర్లు ఎంతోమందికి ట్రీట్‌మెంట్ చేసి వాళ్ల వ్యాదులను నయం చేస్తున్నారు. నేను కూడా ఎంతో మందికి వైద్యం చేసి వాళ్ల వ్యాదులను నయం చేయాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరూ డాక్టర్ వృత్తిని ఎంచుకోలేదు..” అంటూ తెలిపింది ఆఫ్రీన్.

Leave A Reply