Business is booming.

అజిత్‌ అభిమానుల మధ్య ఘర్షణ: ఇద్దరికి కత్తిపోట్లు

‘తల’ అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ చిత్రం విడుదల సందర్భంగా అభిమానుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు. స్థానిక ఓల్డ్‌ టౌన్‌కు చెందిన ప్రశాంత్‌ (20) అతని మామ రమేష్‌ (30)లు అజిత్‌ అభిమానులు. గురువారం విడుదలైన ‘విశ్వాసం’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన తెల్లవారుజామున 4 గంటలకు స్థానిక అలంకార్‌ థియేటర్‌లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా థియేటర్‌లో సీట్ల విషయమై ప్రశాంత్‌, మరో వర్గం మధ్య వివాదం చెలరేగింది. దీంతో, ఎదుటి వర్గం వారు కత్తులతో ప్రశాంత్‌, రమేష్‌లపై దాడి చేశారు. ఈ ఘటనతో భయభ్రాంతులైన అభిమానులు థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వేలూరు దక్షిణ విభాగం పోలీసులు అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి పరారైన మరో వర్గం వారి కోసం గాలిస్తున్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.