Business is booming.

ఎయిర్‌టెల్‌కు షాక్.. కొనసాగుతున్న జియో జైత్రయాత్ర

టెలికం మార్కెట్లో రిలయన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ప్రతీ నెలా సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటూ దూసుకుపోతోంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబరు నెలలో ఒక్క జియోకు మాత్రమే కొత్త ఖాతాదారులు వచ్చి చేశారు. వొడాఫోన్-ఐడియాకు ఆ నెలలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబరులో జియోకు 13.02 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులు చేరారు.

మేజర్ టెల్కోలైన ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్‌లు ఆ నెలలో ఖాతాదారులను భారీగా కోల్పోయాయి. ప్రస్తుతం జియో ఖాతాదారుల సంఖ్య 252.2 మిలియన్లుగా ఉంది. అంటే మొత్తం మార్కెట్‌ షేర్‌లో ఇది 21.57 శాతం. సెప్టెంబరులో ఖాతాదారులను కోల్పోయినప్పటికీ 29.38 శాతం మార్కెట్ షేర్‌తో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎయిర్‌టెల్ మొత్తం ఖాతాదారుల సంఖ్య 343.5 మిలియన్లు. అయితే, ఇందులో 2.3 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఐడియా 4.06 మిలియన్ల మందిని, వొడాఫోన్ 2.6 మిలియన్ల మందిని, బీఎస్ఎన్ఎల్ 0.53 మిలియన్ల మందిని కోల్పోయాయి.

Comments are closed, but trackbacks and pingbacks are open.