Business is booming.

అఫిడవిట్‌ ప్రకారం కేటీఆర్ ఆస్తులు అక్షరాలా…

 తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌‌లో ప్రకటించిన స్థిర, చరాస్థుల వివరాలను 30 పేజీల్లో చూపించారు.
ఆస్తుల వివరాలు..
స్థిరాస్తులు: రూ.1.30కోట్లు
చరాస్తులు: రూ.3.63 కోట్లు
మొత్తం అప్పు : రూ.33.28 లక్షలు
చేతిలో ఉన్న డబ్బు: రూ.1,42,594
వృత్తి: వ్యవసాయం
మొత్తం కేసులు : 16
వాహనాలు: ఒక్క ఇన్నోవా కారు మాత్రమే.
భార్య పేరిట ఆస్తులు
స్థిరాస్తులు: రూ.8.98 కోట్లుచరాస్తులు: రూ.27.70 కోట్లు
మొత్తం అప్పు : రూ.27.39 కోట్లు అప్పులు
చేతిలో ఉన్న డబ్బు: రూ.1,08,231
కేటీఆర్ విద్య:
:- పదవ తరగతి: 1991లో హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌.
:- ఇంటర్మిడియట్: 1993లో గుంటూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ.
:- బిఎస్‌సీ: 1996లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ.
ఎమ్మెస్సీ: 1998లో పూణె వర్శిటీ
ఎంబీఏ: 2000లో అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ న్యూయార్క్‌లో పూర్తి చేశారు.
కాగా.. చివరి రోజున టీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్, జగదీష్‌రెడ్డి, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు ఇవాళ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మంగళవారం అధికారులు ఇప్పటి వరకూ దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. 11న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Comments are closed, but trackbacks and pingbacks are open.