Business is booming.

900 ఏళ్ల క్రితం నాటి బంగారు నాణాలు ల‌భ్యం..

ఇజ్రాయిల్‌లో సుమారు 900 ఏళ్ల క్రితం నాటి బంగారు నాణాలు ల‌భ్యం అయ్యాయి. మ‌ధ్య‌ద‌రా తీరంలోని సిసెరా ప‌ట్ట‌ణంలో ఆ నాణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఓ బ్రాంజ్ బాక్సులో సుమారు 24 గోల్డ్ కాయిన్స్ ఉన్న‌ట్లు పురావ‌స్తు శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఆ బాక్సులో చెవి రింగులు కూడా ఉన్నాయి. ఓ ఇంట్లో ఉన్న బావిలో బ్రాంజ్ బాక్సును గుర్తించారు.

అబ్బాసిద్‌, ఫాతిమిద్ కాలాల‌కు ఆ బంగారు నాణాలు చెంది ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. బ‌హుశా అవి 11వ శ‌తాబ్ధ‌పు నాణాలు అయి ఉంటాయ‌ని భావిస్తున్నారు. క్రుసేడ‌ర్ల దాడిలో సిసెరా ప‌ట్ట‌ణం పూర్తిగా ధ్వంస‌మైంది. అయితే ఆ శ‌తాబ్ధానికి చెందిన రాజు సంప‌ద అయి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. రోమ‌న్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో కింగ్ హెరాడ్ ఈ ప‌ట్ట‌ణాన్ని నిర్మించారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.