పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా గురువారం ప్రపంచ రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఫలితంగా 82 ఏళ్లపాటు పదిలంగా ఉన్న రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో యాసిర్ ఈ ఘనత సాధించాడు.
టెస్టు అరంగేట్రం చేసిన కివీస్ ఆటగాడు విల్ సోమర్విల్లేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న 32 ఏళ్ల యాసిర్ షా ఖాతాలోకి 200 వికెట్లు చేరాయి. యాసిర్కు ఇది 33వ టెస్టు కావడం గమనార్హం. ఫిబ్రవరి 1936లో ఆస్ట్రేలియా స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ 36 మ్యాచుల్లో 200 పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. 82 ఏళ్లపాటు భద్రంగా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు షా బద్దలు గొట్టి అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డులకెక్కాడు.
Approaches+to+Shop+Smarter
82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టిన పాక్ లెగ్ స్పిన్నర్ – Smac Tech