Business is booming.

‘2.ఓ’.. దుబాయ్‌లో రోజుకు అన్ని షోలా!

‘2.ఓ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఇప్పటికే విశ్లేషకులు చెప్పారు. కాగా ఈ సినిమా మార్నింగ్‌ షోను ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని పంపిణీదారులు భావిస్తున్నారట. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పంపిణీదారుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని, తిరుచ్చిలో 20 కన్నా ఎక్కువ మార్నింగ్‌ షోలకు సన్నాహాలు చేస్తున్నారని రజనీ ఫ్యాన్‌ పేజీలో ట్వీట్‌ చేశారు.

అంతేకాదు దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ VOX సినిమాస్‌లో ‘2.ఓ’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి పంపిణీదారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించబోతోందని విశ్లేషకులు అంటున్నారు.

2010 సూపర్‌ హిట్‌ ‘రోబో’కు స్వీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘2.ఓ’. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయిక. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించారు. భారత చిత్ర పరిశ్రమలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments are closed, but trackbacks and pingbacks are open.