4జీ ఫోన్ల హవా నడుస్తుండగానే చైనా మొబైల్ మేకర్ షావోమీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. చాలా మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్ల రూపకల్పనలో బిజీగా ఉండగానే షావోమీ ఏకంగా ఫోన్‌నే ఆవిష్కరించింది. నిజానికి 5జీ స్మార్ట్ఫోన్లు వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తుండగానే షావోమీ 5జీ వెర్షన్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ మిక్స్ 3’ని ఆవిష్కరించి షాకిచ్చింది. చైనాలో జరిగిన ఓ కాన్ఫ్‌రెన్స్‌లో దీనిని ఆవిష్కరించిన షావోమీ ఫోన్ పనితీరు, సామర్థ్యం, వెబ్ సర్ఫింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్ వంటివి 5జీలో ఎంత వేగంగా ఉంటాయో డెమో ద్వారా వివరించింది.
వచ్చే ఏడాది మొదట్లోనే యూరప్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం.\ఎంఐ మిక్స్ 3 ఫీచర్ల విషయానికొస్తే.. 6.39 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 12 ఎంపీ+12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 24 ఎంపీ +2 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 3200 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉన్నాయి.
Comments are closed, but trackbacks and pingbacks are open.